రాష్ట్రంలో భారీ వర్షాలు... 36 రైళ్లు రద్దు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఏకంగా 36 రైళ్లు రద్దయ్యాయి. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు... 36 రైళ్లు రద్దు
X

దిశ‌, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాల కారణంగా ఏకంగా 36 రైళ్లు రద్దయ్యాయి. మెదక్, కామారెడ్డి, సిద్దిపేటలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. దీంతో రైల్వే ట్రాక్ లపై సైతం వదర నీరు పొంగిపొర్లుతోంది. ఈ నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో శ్రీధర్ తెలిపారు.

మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు పేర్కొన్నారు. 36 రైళ్లను రద్దు చేయడంతో పాటు, 25 రైళ్లను దారి మళ్లించి మరో 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు చెప్పారు. వర్షాల కారణంగా రైలు ప్రయాణికులే కాకుండా రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించే వారు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డిలో జాతీయ రహదారి కొట్టుకుపోవడంతో పూర్తిగా మూసివేశారు. దీంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు ఇతర మార్గాల గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది.

Next Story