44 లక్షల మంది ఖాతాలో 3487 కోట్ల రైతు భరోసా నిధులు జమ

by Muthe.Rajitha |   (  Updated:2025-02-12 17:30:29  IST  )

రాష్ట్రంలో వ్యవసాయ సాగు యోగ్యమైన మూడు ఎకరాల వరకు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు బుధవారం జమ చేశారు.

44 లక్షల మంది ఖాతాలో 3487 కోట్ల రైతు భరోసా నిధులు జమ
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వ్యవసాయ సాగు యోగ్యమైన మూడు ఎకరాల వరకు ఉన్న భూములకు రైతు భరోసా నిధులు బుధవారం జమ చేశారు. బుధవారం ఒక్క రోజే రూ.1230కోట్లను రైతు ఖతాలో జమ చేసినట్లుగా వ్యవసాయ శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు 44,82,265 మంది రైతులకు 58,13,036 ఎకరాల భూమికి రైతు భరోసాను రూ.3487 కోట్లను అందించినట్లుగా వ్యవసాయ శాఖ తెలిపింది. వ్యవసాయ యోగ్యమైన భూములకు జనవరి 27 నుంచి రైతు భరోసా నిధుల జమ మొదలు కావడం మొదలైంది. ఇప్పటి వరకు విడతల వారిగా నిధులను జమ చేశారు. యాసంగి పంటకు రైతులకు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎకరానికి రెండు పంటలకు రూ.12వేలు ఇస్తుంది. దీని లో భాగంగా యాసంగిలో ఎకరానికి రూ.6వేలు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకే సగానికి పైగా రైతులకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. త్వరలోనే మిగిలిన రైతులకు నిధులను వారి ఖాతాల్లో జమ చేయనున్నారు.





Next Story