- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
33 మంది నేత కార్మికులకు కొండా లక్ష్మణ్‌బాపూజీ అవార్డు
రాష్ట్ర ప్రభుత్వం రేపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రేపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది నేత కార్మికులు, డిజైనర్లకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డులు ప్రదానం చేయనుంది. ప్రభుత్వం చేనేత, పవర్‌లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేసింది. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, సంస్థలు టీజీఎస్‌సీఓ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2025–26లో ఇప్పటివరకు రూ.587.26 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చింది. ఇందిరా మహిళ శక్తి స్వయం సహాయక బృందాలకు ఏడాదికి రెండు సార్లు ఉచితంగా చీరల పంపిణీ. 65 లక్షల మంది మహిళలకు పంపిణీ చేసేందుకు 131 మ్యాక్స్, 56 చిన్నతరహా పరిశ్రమలలో చీరలు తయారు చేయిస్తున్నారు. రూ. 50 కోట్ల కార్పస్ ఫండ్ద్వారా గత ఏడాది TGSCO నోడల్ ఏజెన్సీగా వేములవాడలో యార్న్ డిపోను ఏర్పాటు చేసింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ని హైదరాబాద్ లో నెలకొల్పింది. చేనేత కార్మికులకు రూ.లక్ష వరకు రుణ మాఫీ పథకం అమలు చేయడంతో పాటు ఈ పథకానికి రూ.33 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగా కార్మికులు తమ జీతం నుండి 8 శాతం పొదుపు చేస్తే, ప్రభుత్వం వారి జీతానికి డబుల్ మద్దతుగా ఇస్తుంది. ఈ పథకంతో దాదాపు 36,133 మంది కార్మికులు లబ్ధి పొందుతున్నారు. పవర్‌లూమ్ కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో దాదాపు 15 వేల మంది లబ్ధి కలుగుతుంది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.30 కోట్లు కేటాయించారు. తెలంగాణ నేతన్న భద్రత పథకం కింద చనిపోయిన చేనేత, అనుబంధ కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. నేతన్నకు భరోసా పథకం అమలు చేస్తూ కార్మికులకు ప్రోత్సాహకంగా ఏడాదికి రూ.18 వేలు, అనుబంధ కార్మికులకు రూ.6 వేలు అందిస్తుంది. ఈ ఏడాది రూ.12.20 కోట్ల పరిపాలనా అనుమతి కూడా ఇచ్చింది.
కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుకు ఎంపికైన వారి జాబితా
1. కరీంనగర్ . తుమ్మ రామస్వామి
2. కరీంనగర్. గుర్రం కొండయ్య
3.మంచిర్యాల. లిక్కి శంకరయ్య
4. వరంగల్. కంచె నర్సింగరావు
5.జనగాం. న్యాలపల్లి విజయ ప్రకాశ్
6.రాజన్న సిరిసిల్ల. శ్రీమతి ఎల్దీ రేఖ
7.రంగారెడ్డి. గంజం శ్రీనివాస్
8.రంగారెడ్డి. గుర్రం చంద్రమౌళి
9.హైదరాబాద్. కర్దాసు రమేశ్
10.సిద్దిపేట. జిందం రాజేషం
11.సిద్దిపేట. బైరి శ్రీనివాస్
12.సిద్దిపేట. మంతూరి వెంకటేశం
13.యాదాద్రి భువనగిరి. గూడ పవన్
14.యాదాద్రి భువనగిరి. కొలను శంకర్
15.యాదాద్రి భువనగిరి. సామల భాస్కర్
16.యాదాద్రి భువనగిరి. మంగళపల్లి శ్రీహరి
17.యాదాద్రి భువనగిరి. చెలిమల కృష్ణ
18.నల్గొండ. కర్నాటి సదుర్గు
19.నల్గొండ. చిలుకూరి శ్రీనివాసులు
20.నల్గొండ. చిట్టిపోలు ధనుంజయ
21.నల్గొండ. గాజుల అనిల్
22.నల్గొండ. గుర్రం యాదయ్య
23.నల్గొండ. మునగపాటి శ్రీనివాస్
24.నల్గొండ. కర్నాటి కృష్ణయ్య
25.నల్గొండ. అవరి రవీంద్ర
26.నారాయణపేట. జన్ను ఆంజనేయులు
27.నారాయణపేట. యాంగల్ ఆంజనేయులు
28.జోగులాంబ గద్వాల్. సూర్య వెంకటేష్
29.జోగులాంబ గద్వాల్. లక్ష్మీ
30.వనపర్తి. దేవరకొండ సీతన్న
31.వనపర్తి. శీల బుడ్డన్న
32.వనపర్తి. మహంకాళి సులోచన
33.వనపర్తి. సారంగి రాములు






