తెలంగాణలో 33% అధిక వర్షపాతం

by Malleboina Mahesh |

రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక పోయినా.. ఆఖరులో భారీ వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

తెలంగాణలో 33% అధిక వర్షపాతం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణం కంటే 33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక పోయినా.. ఆఖరులో భారీ వర్షాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం 988.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ లో 20 శాతం లోటు వర్షపాతం ఉండడంతో రైతుల్లో నిరాశ కనిపించింది. అయితే జూలై నుంచి వర్షాలు ఊపందుకున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 33 శాతం అధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 293 మండలాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా, 188 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.

137 మండలాల్లోనైతే 60 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కేవలం మహదేవ్ పూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ నార్త్.. మూడు మండలాల్లో మాత్రమే లోటు వర్షపాతం నమోదైంది. అయితే రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది అక్టోబర్ లో నెలవారీ వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఆరేళ్లుగా అధిక వర్షాలు నవమోదవుతున్నాయి. ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రానికి బిగ్ రిలీఫ్‌ను, భారీ నీటి వనరులను అందించాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్ లో రికార్డు

హైదరాబాద్ చరిత్రలో ఈ ఏడాది వర్షపాతం రికార్డులు సృష్టించింది. రెండు దశాబ్దాల కాలంలో ఇది అత్యధిక వర్షపాతం అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ నుండి సెప్టెంబర్ వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో సగటున ఏకంగా 897 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 43.7 శాతం అధికం కావడం గమనార్హం.కాగా, గత ఆరేళ్లుగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Next Story