BREAKING: ఈ నెల 30న తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు

by Satheesh |

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని

BREAKING: ఈ నెల 30న తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని ఈ మేరకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో మాత్రం ఈ నెల 29, 30 రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈ నెల 30న పోలింగ్ ముగిసిన అనంతరం తిరిగి డిసెంబర్ 1వ తేదీన విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. ఎన్నికల పోలింగ్ ఎక్కువగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగానే సెలవులు ప్రకటించారు. కాగా, ఈ నెల 30వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు.

Next Story