- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎంపీ, పీఎంపీలకు 3 నెలల ట్రైనింగ్ కోర్స్.. సభలో మంత్రి దామోదర కీలక ప్రకటన
ఆర్ఎంపీ, పీఎంపీలకు శిక్షణ విషయంలో మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు అండగా ఉంటామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎంపీ, పీఎంపీలకు ట్రైనింగ్ కోసం ప్లాన్ చేస్తున్నామని కాళోజీ వర్సిటీ నుంచి 3 నెలల సర్టిఫికెట్ కోర్సు కోసం ప్రణాళిక ఉందన్నారు. వీరి విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకోవడంతో పాటు లీగల్ చిక్కులు ఉన్నాయని న్యాయపరమైన సమస్యలు రాకుండా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆర్ఎంపీ, పీఎంపీలను దొంగలు, నేరస్తుల మాదిరిగా చూస్తున్నారని ఇవాళ శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు ప్రస్తావించారు. వీరిని ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల విపరీతమైన కరప్షన్ కు తెరలేపినట్లైందని అందువల్ల వీరి సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా సమగ్ర విధానం రూపొందిచాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి దామోదర.. ఆర్ఎంపీ, పీఎంపీల ప్రాక్టిస్ కు తాము వ్యతిరేకం కాదని వారి సంక్షేమానికి కమిట్మెంట్‍తో ఉన్నామని ఈ విషయాన్ని మేనిఫెస్టోలోనూ పేర్కొన్నామన్నారు. ఈ క్రమంలో కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నాయని వాటిని అధ్యయనం చేసి ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచన అని చెప్పారు.
నిమ్స్ పై ఒత్తిడి తగ్గించాలి:
నిమ్స్ ఆసుపత్రి ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్ల కొరత ఉందని ఈ సమస్యను పరిష్కరించాలని తక్కెళ్లపల్లి రవీందర్ ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాల నుంచి అత్యవసర వైద్యం కోసం వచ్చిన రోగులకు బెడ్లు దొరకక బయటే ఉండిపోతున్నారన్నారు. నిమ్స్ లో మరో 150 వైద్యుల కొరత ఉందని సర్జికల్, న్యూరో సర్జికల్ విభాగాల్లో విపరీతమైన కొరత ఉందన్నారు. చాలా మంది మంచి మంచి ప్రొఫెసర్లు నిమ్స్ ను వీడి ప్రైవేట్, ఇతర ఆసుపత్రులకు వెళ్తున్నారని ఈ విషయంలో పూర్తిగా అధ్యయనం చేసి నివారించాలన్నారు. నిమ్స్ అదనపు ఆసుపత్రి, హైదరాబాద్, వరంగల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు నత్తనడకన జరుగుతున్నాయన్నారు. వీటి నిర్మాణం పూర్తయితే నిమ్స్ పై ఒత్తిడి తగ్గుతుందన్నారు.
మ.1 గంట వరకే డాక్టర్లు ఉంటున్నారు: మండలి చైర్మన్
ఈ సందర్భంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఉంటున్నారని ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆర్ఎంపీలు కార్పొరేట్ ఆస్పత్రుల దగ్గర కమీషన్లు తీసుకుని పేద రోగులను లూటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందువల్ల ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలని గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వానికి సూచన చేశారు. అవసరం అయితే వైద్యులకు జీతాలు పెంచాలని, అలాగే నూతనంగా వచ్చే రెసిడెంట్ డాక్టర్లు 1 సంవత్సరం గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ట్రైనింగ్ కు పంపించాలని దీనికి కూడా వెళ్లకుండా కొంత మంది పైరవీలు చేస్తున్నారని ఇలాంటి వాటిని అనుమతి ఇవ్వొద్దని మంత్రి దామోదరకు చైర్మన్ సూచించారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.






