- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల డెడ్‌లైన్.. స్పీకర్ ప్రసాద్ కుమార్ రియాక్షన్ ఇదే
రాష్ట్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. మూడు నెలల్లోపే శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. అదేవిధంగా న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్’ అన్న సూత్రం వర్తించకూడదని ఫన్నీ కామెంట్ చేసింది. అదేవిధంగా కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేస్తూనే.. పార్టీలు ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేల పట్ల పార్లమెంట్‌లో ఓ చట్టం చేయాలని ధర్మాసనం కామెంట్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాజాగా.. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Gaddam Prasad Kumar) స్పందించారు. కోర్టు తీర్పును పూర్తిగా చదివాక ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పందిస్తానని తెలిపారు. అదేవిధంగా తీర్పుపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చిస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తాము గతంలోనే నోటీసులు ఇచ్చామని తెలిపారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని స్పీకర్ ప్రసాద్ కుమార్ కామెంట్ చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.






