తెలంగాణలో అప్పుడే ఓటు వేసిన 27,178 మంది ఓటర్లు.. పోలింగ్ స్టార్ట్ కాకముందే ఎలా అంటే.. ?

by Satheesh |

తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్‌ ఓటింగ్‌ విధానం విజయవంతమైంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం ఎంతో

తెలంగాణలో అప్పుడే ఓటు వేసిన 27,178 మంది  ఓటర్లు.. పోలింగ్ స్టార్ట్ కాకముందే ఎలా అంటే.. ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్‌ ఓటింగ్‌ విధానం విజయవంతమైంది. పోలింగ్‌ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం ఎంతో ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలంటే పోలింగ్ కేంద్రానికి వెళ్లాల్సిందే. లేదా వారు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండేది కాదు. కానీ ఎన్నికల సంఘం తొలిసారిగా తీసుకువచ్చిన హోమ్‌ ఓటింగ్‌ ద్వారా వారంతా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్‌ ఓటింగ్‌ను తెచ్చామని.. ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27 ,178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు హోమ్‌ ఓటింగ్‌ విధానం ద్వారా నుంచి ఇంటి వద్దే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఎన్నికల సిబ్బంది, బీఎల్వో, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లకు వెళ్లి బ్యాలెట్‌ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు.

Next Story