VIRAL: 27 లీటర్ల ట్యాంక్‌లో 29 లీటర్ల పెట్రోల్.. హైరదాబాద్ లో వెలుగులోకి పెట్రోల్ బంక్ మోసం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-01 05:47:50  IST  )

హైదరాబాద్‌లో కొన్ని పెట్రోల్ బంక్‌ల మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పట్లో పెట్రోల్ లో నీళ్లు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల రీడింగ్ ఎక్కువ చూపించి పెట్రోల్ తక్కువ కొడుతున్నారనే వార్తలు వచ్చాయి.

VIRAL: 27 లీటర్ల ట్యాంక్‌లో 29 లీటర్ల పెట్రోల్.. హైరదాబాద్ లో వెలుగులోకి పెట్రోల్ బంక్ మోసం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో కొన్ని పెట్రోల్ బంక్‌ల మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పట్లో పెట్రోల్ లో నీళ్లు వచ్చిన ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని చోట్ల రీడింగ్ ఎక్కువ చూపించి పెట్రోల్ తక్కువ కొడుతున్నారనే వార్తలు వచ్చాయి. కాగా తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హయత్ నగర్‌లోని ఓ పెట్రలో బంక్‌లో కారు యజమాని 27 లీటర్ల కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఫుల్ చేయమని చెబితే అందులో 29.5 లీటర్ల పెట్రోల్ నింపినట్టు సిబ్బంది తెలిపారు. అయితే అప్పటికే రెండు, మూడు లీటర్లు పెట్రోల్ ఉందని, అందులో 9 లీటర్లకు పైగా పెట్రోల్ ఎలా నింపారని బంక్ సిబ్బందిని నిలదీశాడు.

తన కారులో పోసిన పెట్రోల్ కొలవాలని చెప్పాడు. 5 లీటర్ల క్యానులతో కొలుస్తామని చెబుతున్నారని, అలా కాకుండా మెజరింగ్ సిలిండర్ తోనే పెట్రోల్ కొలవాలని డిమాండ్ చేశాడు. బంకులో ఎలాంటి సమస్య లేదని, కారులోనే సమస్య ఉంది చూపించుకోండని సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని తెలిపాడు. నిలదీస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోవాలని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి అధికారులు ఇలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

Next Story