గులాబీ దళం జైత్రయాత్రకు 25 ఏళ్లు.. ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-27 05:19:48  IST  )

బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం వేళ తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ అత్యున్నత స్థాయి భేటీ నిర్వహించనున్నారు.

గులాబీ దళం జైత్రయాత్రకు 25 ఏళ్లు.. ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఇవాళ 25వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ గులాబీ తోరణాలతో ముస్తాబైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. అనంతరం అమరవీరులకు నివాళులర్పించి, పార్టీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ప్రసంగించనున్నారు.

కేసీఆర్ అత్యున్నత సమావేశం..

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అనంతరం ఆయన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, జిల్లాల పార్టీ అధ్యక్షులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, అధికార పార్టీ నిర్ణయాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఎలా అందిపుచ్చుకోవాలనే దానిపై చర్చించనున్నారు. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న వేళ, సంస్థాగతంగా పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి..? అనే దానిపై కేసీఆర్ రోడ్ మ్యాప్ (Road Map) ఇవ్వనున్నారు. చివరగా ప్రజా సమస్యలపై రాబోయే రోజుల్లో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళికను కేసీఆర్ ఇదే సమావేశంలో ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

Next Story