- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై 31 నాటికి ఓటర్ల జాబితా ముద్రిస్తాం: GHMC కమిషనర్
జులై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: జులై 31 నాటికి ఎన్నికల జాబితా ముద్రిస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. దీనిపై సెప్టెంబర్ 20వ తేదీ వరకూ అభ్యంతరాలు, విజ్ఞప్తులు స్వీకరిస్తామని, అక్టోబర్ 1న ఓటర్ల తుది జాబితా ముద్రిస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో కొనసాగుతున్న SIR ప్రక్రియకు ప్రజలు సహకరించాలని కోరారు. సర్ ప్రక్రియ కింద ఇప్పటి వరకూ 22 లక్షల ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని ఆర్వ కర్ణన్ ప్రకటించారు. మరో 25 లక్షల ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాల్సి ఉందని, అందుకు కొంత సమయం పడుతుందన్నారు. ఈ ప్రక్రియలో బీఎల్ఓలతో పాటు.. అన్ని రాజకీయ పార్టీల తరఫున బీఎల్ఏలు ఉంటారని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫాం ఇవ్వకపోతే ఓటు ఉండదని కర్ణన్ వెల్లడించారు. ఆన్ లైన్లో కూడా ఎన్యుమరేషన్ ఫాం సబ్మిట్ చేయవచ్చని, ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. అలాగే ఇందుకోసం ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు కార్డులేవీ అక్కర్లేదని కర్ణన్ స్పష్టం చేశారు. SIR ప్రక్రియలో ఓటరు తమ లేటెస్ట్ ఫొటో పెట్టాలని తెలిపారు. భర్త ఆస్పత్రిలో చేరి ఉంటే భార్య అతని ఎన్యుమరేషన్ ఫామ్ పై సంతకం చేసి.. ఇవ్వొచ్చునని కర్ణన్ వివరించారు.
25 నుంచి ఎస్ఐఆర్ షురూ..
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈనెల 25వ తేది నుంచి ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభం కానుందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. ఈనెల 25 నుంచి జులై 24వ తేది వరకు బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేస్తారని తెలిపారు. జులై 24 నుంచి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. జులై31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించనున్నామని చెప్పారు. 31 జులై నుంచి 30 ఆగస్టు వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నామని తెలిపారు. 31జులై నుంచి 28సెప్టెంబర్ వరకు నోటీసులు, అభ్యంతరాలను క్లియర్ చేయనున్నట్టు తెలిపారు. ఫైనల్ ఓటరు జాబితాను అక్టోబర్ 1వ తేదిన ప్రచురించనున్నట్టు వివరించారు.
మ్యాపింగ్ 46.65 శాతమే..
హైదరాబాద్ జిల్లాల్లో 47,36,669 ఓటర్లు ఉన్నారని, వీరిలో మహిళా ఓటర్లు 23,36,448మంది, పురుషులు 23,99,880మంది, ఇతరులు 341 మంది ఉన్నారని తెలిపారు. అయితే 22,09,647 ఓటర్లకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయిందని, మరో 25.27,022 మ్యాపింగ్ కాలేదని చెప్పారు. 1,684 ప్రాంతాల్లో 4,062 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. బీఎల్ఓలు 4,062, బీఎల్ఓ సూపర్వైజర్లు 408, ఎలక్షన్ డీటీలు 15, ఈఆర్ఓలు 15, ఏఈఆర్ఓలు 93 మంది అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు.
10,901 మంది బీఎల్ఏ ఏజెంట్లు..
ఎస్ఐఆర్ కార్యక్రమంలో బీఎల్ఓలతోపాటు ఆయా రాజకీయ పార్టీలకు చెందిన బీఎల్ఏలు సైతం అందుబాటులో ఉంటారని కమిషనర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 3,601, బీజేపీ 2,941, బీఆర్ఎస్ 1988, మజ్లీస్ పార్టీ 2,371 మందిని నియమించారని, మిగిలినవారిని త్వరలోనే నియమించే అవకాశముందని తెలిపారు. ఒక్కో బీఎల్ఏ రోజుకు 50ఎన్యూమరేషన్ ఫామ్స్ ను ఇంటింటికి తిరిగి పంపిణీ చేయడానికి ఎన్నికల సంఘం అనుమతిచ్చిందని తెలిపారు.
గుర్తింపు కార్డులు..
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ తర్వాత, ఎన్నికల నమోదు అధికారి/సహాయక ఎన్నికల నమోదు అధికారికి ప్రతిపాదిత ఓటరు అర్హతపై సందేహం కలిగి, అటువంటి ఓటరుకు నోటీసు జారీ చేస్తే, అప్పుడు సంబంధిత ఓటరు తన అర్హతను నిరూపించుకోవడానికి సహాయక పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని కమిషనర్ కర్ణన్ తెలిపారు. వీటిలో ‘ఏదైనా కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/ప్రభుత్వ రంగ సంస్థ (PSU) సాధారణ ఉద్యోగి/పెన్షనర్‌కు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు/పెన్షన్ చెల్లింపు ఉత్తర్వులు. 987కు ముందు భారతదేశంలో ప్రభుత్వం/స్థానిక సంస్థలు/బ్యాంకులు/తపాలా కార్యాలయం/LIC/PSUలచే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు/సర్టిఫికేట్/పత్రం. సంబంధిత అధికారిచే జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రం. పాస్‌పోర్ట్. గుర్తింపు పొందిన బోర్డులు/విశ్వవిద్యాలయాలు జారీ చేసిన మెట్రిక్యులేషన్/విద్యా ధృవీకరణ పత్రం. సంబంధిత రాష్ట్ర అధికార సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధృవీకరణ పత్రం. అటవీ హక్కుల ధృవీకరణ పత్రం. సమర్థ అధికారిచే జారీ చేయబడిన OBC/SC/ST లేదా ఏదైనా కుల ధృవీకరణ పత్రం. రాష్ట్ర/స్థానిక అధికారులచే రూపొందించబడిన కుటుంబ నమోదు పత్రం (Family Register). ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన ఏదైనా భూమి/గృహ కేటాయింపు ధృవీకరణ పత్రం’ పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలిపారు.






