సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,639 హెల్త్ క్యాంపులు

by Ajay Maddhiboyina |

రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 20,639 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల క్యాంపుల నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు.

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా 20,639 హెల్త్ క్యాంపులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 20,639 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నారు. ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి టీచింగ్ హాస్పిటల్స్ వరకూ అన్ని చోట్ల క్యాంపుల నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లలో స్క్రీనింగ్ క్యాంపులు, టీవీవీపీ హాస్పిటళ్లు, టీచింగ్ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్లతో క్యాంపులు నిర్వహించనున్నారు. సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లతో ప్రతి జిల్లాలో ఒక మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని... తద్వారా మహిళల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో భాగంగా రక్తపోటు, మధుమేహం సహా ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ క్యాన్సర్లు, తదితర వ్యాధులపై స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.

కౌమార దశ బాలికలు, మహిళల్లో రక్తహీనత పరీక్షలు చేసి కౌన్సెలింగ్ అందించనున్నారు. క్షయవ్యాధి (టీబీ) పరీక్షలు నిర్వహిస్తారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ వ్యాధి (ఎస్సీడీ) పరీక్షలు చేసి కార్డులు పంపిణీ చేసి, సలహా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గైనకాలజిస్టులు, పిల్లల వైద్యులు, నేత్ర నిపుణులు, ఈఎన్టీ వైద్యులు, దంత వైద్యులు, డెర్మటాలజిస్టలు, మానసిక వైద్యులు తదితరులను మెడికల్ కాలేజీలు, జిల్లా ఆసుపత్రులు, జిల్లా రెసిడెన్సీ ప్రోగ్రామ్ నుండి ప్రత్యేకంగా సమకూరుస్తున్నారు.

మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణీ స్త్రీలకు పూర్తి వైద్య పరీక్షలు (ఏఎన్సీ), హీమోగ్లోబిన్ పరీక్షలు, గర్భధారణ సమయంలో పోషకాహారం, జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. మాతాశిశు సంరక్షణ కార్డులను సైతం పంపిణీ చేస్తారు. చిన్నారులకు టీకాలు వేయనున్నారు. మహిళలు, బాలికలకు రుతుక్రమ పరిశుభ్రత, పోషకాహారం ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూనె, చక్కెర వినియోగాన్ని 10 శాతం తగ్గించే ప్రచారాన్ని స్వయంసహాయక సంఘాలు (ఎస్.హెచ్.జి.లు) ద్వారా కొనసాగించనున్నారు. రక్తదానంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మెగా డ్రైవ్‌లో భాగంగా 1 లక్ష యూనిట్ల రక్తాన్ని సేకరించి, రక్తదాతల రిజిస్ట్రేషన్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మై గవ్ (MyGov) ద్వారా రక్తదానం ప్రతిజ్ఞలు చేయడానికి అవకాశం కల్పించారు.

Next Story