రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రేర్ సీన్.. ఆత్మీయంగా కలిసిన 2009 కాంగ్రెస్ ఎంపీలు

by Satheesh |

తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడిన ఎంపీలు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ రేర్ సీన్.. ఆత్మీయంగా కలిసిన 2009 కాంగ్రెస్ ఎంపీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడిన ఎంపీలు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం రోజు మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన గెట్ టూ గేదర్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్​గెస్ట్‌గా దీపాదాస్ మున్షి హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ స్మృతులను అప్పటి ఎంపీలంతా నెమరు వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్లమెంట్ లోపలా, బయటా చేసిన తమ పోరాట స్మృతులను ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షికి వివరించారు. రాష్ట్రంలో ఉద్యమ పరిస్థితులు, పొలిటికల్ పార్టీ ప్రెజర్లు, ఉమ్మడి ఏపీలోని లీడర్ల ఒత్తిడి వంటి అంశాలన్నింటిపై చర్చించారు.

ఒకే పార్టీలో రెండు వేర్వేరు అభిప్రాయాలపై హైకమాండ్ వ్యవహరించిన తీరు, రాష్ట్రం కోసం సోనియా గాంధీపై తెచ్చిన ఒత్తిడి వంటివన్నీ మాజీ ఎంపీలు వివరించారు. రాష్ట్రాన్ని సాధించే వరకు ఎంపీలు పోరాడిన విధానాన్ని వెల్లడించారు. ఆ తర్వాత మాజీ ఎంపీలకు(2009 పార్లమెంట్‌లో) దీపా దాస్ మున్షి సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జి వివేక్, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్, సిరిసిల్ల రాజయ్యలు హాజరయ్యారు.

Next Story