- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రదాడుల్లో 20 వేల మంది భారతీయులు మృతి.. ఐరాసలో భారత ప్రతినిధి స్పష్టం
ఐక్యరాజ్యసమితిలో సింధూ జలాల ఒప్పందాన్ని పాక్ లేవనెత్తింది. ప్రాణాధారమైన సింధూ జలాలను భారత్ ఆయుధంగా వాడుకుంటుందని, తమకు నీటిని విడుదల చేయట్లేదని ఆరోపించింది.

ఐక్యరాజ్యసమితిలో సింధూ జలాల ఒప్పందాన్ని పాక్ లేవనెత్తింది. ప్రాణాధారమైన సింధూ జలాలను భారత్ ఆయుధంగా వాడుకుంటుందని, తమకు నీటిని విడుదల చేయట్లేదని ఆరోపించింది. దీనిపై భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ఘాటుగా బదులిచ్చారు. సింధుజలాల ఒప్పందంపై భారత్ ఎప్పుడూ బాధ్యతగానే ఉంటుందని, పాక్ మాత్రం దానిని అడ్డుపెట్టుకుని పలుమార్లు యుద్ధం, సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతూ తూట్లు పొడిచిందన్నారు. గడిచిన 4 దశాబ్దాల్లో భారత్ పై జరిగిన ఉగ్రదాడుల్లో 20 వేల మందికిపైగా ప్రజలు మరణించారని, అయినా భారత్ సహనంగా సింధుజలాల ఒప్పందాన్ని కొనసాగించిందన్నారు. పాక్ సీమాంతర ఉగ్రవాదంపై ఆయన చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వార్త చదవండి.
మిస్ వరల్డ్ ఫెస్టివల్ లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన టాప్ మోడల్ పోటీ హైదరాబాద్ లోని ట్రిడెంట్ హోటల్ లో కన్నులపండువగా సాగింది. మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునేందుకు టాప్ మోడల్ పోటీ అత్యంత కీలకమైంది. ఉత్కంఠభరితమైన పోటీ ముగింపులో నలుగురు అసాధారణమైన పోటీ దారులు టాప్ మోడల్ విజేతలుగా కిరీటాన్ని అందుకున్నారు. మిస్ ఇండియా నందినిగుప్తా ఆసియా, ఓషియానియా ఖండం నుంచి విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన మిగతా ముగ్గురు ఎవరు? టాప్ మోడల్స్ గా ఎంపికవ్వడంపై మోడల్స్ ఏమన్నారు? పూర్తి వార్త కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టీమిండియా టెస్ట్ క్రికెక్ కెప్టెన్ ఎవరన్న సందిగ్ధానికి బీసీసీఐ తెరదించింది. యువ బ్యాటర్ గిల్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు అందించింది. టీమిండియాకు అతను 37వ టెస్ట్ కెప్టెన్. వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్ కు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టులో ఎవరెవరున్నారు? పూర్తి వార్త కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
బాలీవుడ్ హాట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి యానిమల్ తో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒక్క సినిమాతోనే తన రేంజ్ మారిపోవంతో అమ్మడుకి వరుస అవకాశాలు వస్తున్నాయి. గతేడాది రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ ఫామ్లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిప్తి ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ ఏంటి? ఓవర్ నైట్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి.






