- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ 20 మంది స్టార్ క్యాంపైనర్లు.. గాంధీభవన్‌లో కీలక సమావేశం

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరుఫున ప్రచారం చేసే స్టార్ క్యాంపెనర్ల లిస్టును కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇరవై మందితో కూడిన జాబితాను రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ కి అందజేశారు. ఈ స్టార్ క్యాంపెనర్ల జాబితాలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, జి.వివేకానంద, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి, మహమ్మద్ అజారుద్దీన్, సీడబ్లూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్ రెడ్డి, మాజీ ఎంపీ హన్మంతరావులు ఉన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీలు..
మునిసిపల్ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీలను టీపీసీసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టీపీసీసీ చీఫ్మహేష్ కుమార్ గౌడ్ జాబితాను విడుదల చేశారు. ఈ స్క్రీనింగ్ కమిటీలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా నియమించారు. కమిటీలను పార్లమెంట్ ఇంచార్జ్ మంత్రి చైర్మన్ గా.. పార్లమెంట్ పరిధిలోని డీసీసీ అధ్యక్షులు కన్వీనర్లుగా, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లు, కార్పొరేషన్ చైర్మన్‌లు, టీపీసీసీ ఆఫీస్ బేరర్స్, ఫ్రంటల్ హెడ్స్ సెల్స్ చైర్మన్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా కమిటీ నియామకాలను చేపట్టారు. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా, శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ నేతలు చెప్పారు.
గాంధీభవన్ లో సమావేశం..
గాంధీభవన్ లో గురువారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ , టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని లక్ష్యంగా చేసుకుని తీసుకోవాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలు విస్తృతంగా చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల విశ్వాసాన్ని చూరగోనేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కేశ వేణు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.






