జాతీయ లోక్ అదాలత్‌లో లక్ష 93వేల కేసుల పరిష్కారం!

by Ajay Maddhiboyina |

జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులలో లక్షా 93వేల పై చిలుకు కేసులు పరిష్కారమైనట్లు డీజీపీ జితేందర్ ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.

జాతీయ లోక్ అదాలత్‌లో లక్ష 93వేల కేసుల పరిష్కారం!
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ లోక్ అదాలత్ లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులలో లక్షా 93వేల పై చిలుకు కేసులు పరిష్కారమైనట్లు డీజీపీ జితేందర్ ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. అందులో 6,294 కేసులు సైబర్ క్రైమ్ కి సబంధించినవిగా ఉన్నాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరగ్గా అందులో బాగాంగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులకు సబంధించి స్థానిక న్యాయస్థానాలలో , జిల్లా, రాష్ట్ర న్యాయస్థానలలో కేసులు పరిష్కారం అయినట్లు తెలిపారు. మొత్తం ఎఫ్ఐఆర్ లు కేసులు: 22,095, విపత్తు నిర్వహణ కేసులు 8,922,పెట్టీ కేసులు 84,601 మోటారు వాహన చట్టం కేసులు 71,527 పరిష్కరమైనట్లు వెల్లడించారు. సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53.5 కోట్లు రిఫండ్ చేసినట్లు తెలిపారు.

సైబర్ క్రైమ్ బాధితులలకు అందజేసిన రిఫండ్ కమిషనరేట్ల పరంగా వివరాలు

హైదరాబాద్ 782 - 14.54 కోట్లు

సైబరాబాద్ 2,276 - 13.65 కోట్లు

రాచకోండ - 451 - 9.98 కోట్లు

టీజీసీఎస్బీ - 172 - 5.74 కోట్లు

సంగారెడ్డి - 206 - 1.42 కోట్లు

Next Story