- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌదీ బస్సు ప్రమాదం.. హైదరాబాద్ మల్లేపల్లికి చెందిన 15మంది మృతి
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది సజీవదహనం అయ్యారు. మక్కా నుండి మదీనా వెళుతున్న ట్రావెల్ బస్సు పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం వారి వివరాలను సేకరించే పనిలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్: సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది సజీవదహనం అయ్యారు. మక్కా నుండి మదీనా వెళుతున్న ట్రావెల్ బస్సు పెట్రోల్ ట్యాంకర్ ను ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీలే ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం వారి వివరాలను సేకరించే పనిలో ఉంది. ఇప్పటి వరకు హైదరాబాద్ మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన 15మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.
మృతుల్లో రహీమున్నీసా, రహమత్ బీ, షెహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్, సోహైల్ మహ్మద్, మస్తాన్ మహ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫర్హీన్ బేగం, జహీన్ బేగం, మహ్మద్ మంజూరు, మహ్మద్ అలీ ఉన్నట్టు గుర్తించారు. వీరిలో రెండు కుటుంబాలకు చెందినవారే 15 మంది ఉన్నారు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది, మరో కుటుంబంలో ఏడుగురు ఉన్నారు. కాగా షోయాబ్ అనే యువకుడు ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






