- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్తగా 157 ప్రాథమిక పాఠశాలలు.. 20 మంది విద్యార్థులుంటే ఒక స్కూల్ ఏర్పాటు
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించేందుకు 157 కొత్త ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక విద్యను మరింత ప్రోత్సహించేందుకు 157 కొత్త ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నూతన పాఠశాలల ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ పాఠశాలలు లేని ఆవాసాల్లో కనీసం 20 మంది విద్యార్థులు ఉన్నచోట విద్యాసౌకర్యం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో 63, పట్టణ/నగర ప్రాంతాల్లో 94 పాఠశాలలను వెంటనే ప్రారంభించాలంటూ ఆయా జిల్లాల డీఈఓలకు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులకు అవసరమైన ఫర్నిచర్, బోర్డులు, పుస్తకాలు, ఇతర విద్యా సామగ్రి కోసం అవసరమైన బడ్జెట్‌ను జిల్లాల కలెక్టర్ల ద్వారా సమకూర్చేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టనుంది. ఈ చర్యలతో రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని భావిస్తున్నారు. కాగా, గతంలో ప్రభుత్వం 212 గ్రామీణ ఆవాసాలు, 359 పట్టణ కాలనీలు/వార్డుల్లో కలిపి మొత్తం 571 పాఠశాలలు స్థాపించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.






