- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగల కోసం 1450 స్పెషల్ రైళ్లు
దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులను అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు సౌకర్యం కోసం అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

దిశ, తెలంగాణ బ్యూరో: దసరా, దీపావళి పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేందుకు వీలుగా రైల్వే శాఖ ప్రత్యేక రైలు సర్వీసులను అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు సౌకర్యం కోసం అనేక ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. జోన్ పరిధిలో పండుగల కోసం ప్రయాణించే వారికి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 1450 ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. వీటికి అదనంగా మరో 500 ప్రత్యేక రైళ్లను కూడా నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన మార్గాల్లో నడుస్తున్న సుమారు 350 రైళ్లకు అదనపు కోచ్‌లను కూడా ఏర్పాటు చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్‌లో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ సందర్భాల్లో సికింద్రాబాద్ స్టేషన్‌లో నిత్యం 1.3 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే... ఈ పండుగ వేళ ప్రయాణికుల సంఖ్య 2 లక్షలకు పెరిగే అవకాశం ఉందని అందుకే ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ చివరి వరకు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పండుగల సందర్భంగా ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను, అదనపు బోగీలను ఏర్పాటు చేసిందని... ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకునాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.






