- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 1.40 లక్షల రేషన్ కార్డులు రద్దు.. కేంద్ర మంత్రి జయంతిభాయ్ బాంభానియా ప్రకటన
దేశవ్యాప్తంగా భారీగా రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ పకడ్బందీగా ముగిసినట్లుగా కేంద్ర ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా అక్రమంగా ఉన్న రేషన్‌కార్డులను తొలగించినట్లు పార్లమెంటులో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 5.51 లక్షల రేషన్దుకాణాలో లబ్ధిదారుల ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఆహార ధాన్యాల పంపిణీని సులభతరం చేసేందుకు ఆపాస్పరికరాలను అమర్చడం జరిగిందని తెలిపారు. దీంతో రేషన్సరకుల పంపిణీ అక్రమాలకు చోటు లేకుండా పోయిందన్నారు. ప్రస్తుతం, ప్రజా పంపిణీ వ్యవస్థ డేటాబేస్‌ను ఇతర సంక్షేమ పథకాలతో లింక్చేయడానికి ఎటువంటి ప్రతిపాదన లేదని చెప్పారు. దేశ వ్యాప్తంగా నిబంధనలకు విరుద్దంగా ఉన్న 41.41 లక్షల కార్డులను తొలగించినట్లు స్పష్టం చేశారు. ఇందులో ఆదాయపు పన్ను శాఖ , రహదారి రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ , కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జీఎస్టీ డేటా ఆధారంగా అక్రమ కార్డులకు కత్తెర పెట్టినట్లు వెల్లడించారు. అతి తక్కువగా ఆంద్రప్రదేశ్‌లో 102 కార్డులు కాగా, అత్యదికంగా రాజస్దాన్‌లో 6 లక్షలకు పైగా కార్డులు తొలగించారు.
తెలంగాణలో పెరిగిన రేషన్‌కార్డుల సంఖ్య..
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ప్రభుత్వంలో ఉన్న కార్డుల కంటే రేవంత్ప్రభుత్వంలో 15 లక్షలకు పైగా కొత్త రేషన్‌కార్డులు పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 17,348 రేషన్‌దుకాణాలు ఉండగా వాటి ద్వారా నెలకు 1.05 కోట్ల కార్డులకు రేషన్పంపిణీ జరుగుతుంది. అందులో ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు 99,36,073 ఉండగా, అంత్యోదయ అన్న యోజన కార్డులు5,66,660, అన్నపూర్ణ కార్డులు 5146 ఉన్నాయి. రాష్ట్రంలో 33 జిల్లాలో అత్యదిక కార్డులు గ్రేటర్మూడు జిల్లాల్లో ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో 936 రేషన్దుకాణాలుంటే కార్డులు 8.39 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 588 షాపులు ఉండగా 6.53 లక్షలు, మేడ్చల్మల్కాజిగిరి జిల్లాలో 655 రేషన్‌దుకాణాలు ఉంటే 6.41 లక్షల కార్డులు ఉన్నాయి. తక్కువ కార్డులు ములుగు జిల్లాలో 1.02 లక్షలు, నారాయణపేట జిల్లాలో 1.69 లక్షలు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.






