- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యావత్ తెలంగాణ ఒక్కటై చేసిన సకల జనుల సమ్మెకు 14 ఏళ్లు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో జనుల సమ్మె అత్యంత కీలక పాత్ర పోషించింది.

దిశ, వెబ్ డెస్క్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సకల జనుల సమ్మె (sakala Janula samme) అత్యంత కీలక పాత్ర పోషించింది. 2011 సెప్టెంబర్ 12న నాటీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) పిలుపు మేరకు అన్ని వర్గాల ప్రజలు దాదాపు 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఉవ్వెత్తున సాగిన ఈ సమ్మెతో ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం కదిలిన విషయం తెలిసిందే. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎంతో పేరుగాంచిన ఈ సకల జనుల సమ్మెకు ఈ రోజుతో 14 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదిక గా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆయన తన ట్వీట్‌లో "తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె.
సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42 రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి, తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం ఈ సకల జనుల సమ్మె. 2011 సెప్టెంబర్ 12 న కరీంనగర్ జన గర్జనలో ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపు మేరకు యావత్ తెలంగాణ సమాజం ఒక్కటయ్యింది. నిర్బంధాలను ఛేదించి, ఆంక్షలకు ఎదురొడ్డి, బెదిరింపులను లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డలు పోరాడారు. సకల జనుల సమ్మెకు నేటితో 14 ఏళ్ళు నిండిన సందర్భంగా.. సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు" అని కేటీఆర్ రాసుకొచ్చారు.






