- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐబొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్.. కాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై తీర్పు
ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.

దిశ, వెబ్‌డెస్క్: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదవ్వగా.. ఒక కేసులో ఇప్పటికే 5 రోజుల కస్టడీ పూర్తయింది. మరో మూడు కేసుల్లో రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. కాసేపట్లో రవి కస్టడీ పిటిషన్ పై కోర్టు తీర్పు వెల్లడించనుంది.
కాగా.. ఐదురోజుల విచారణలో సీసీఎస్ పోలీసులు రవి నుంచి కీలక సమాచారం రాబట్టినట్లు తెలిపారు. రవి వద్ద ఉన్న హార్డ్ డిస్కుల్లో వేల కొద్దీ సినిమాలు ఉన్నట్లు గుర్తించారు. టెలీగ్రామ్ ద్వారా పైరసీ సినిమాలను కొని, వాటిని ఐబొమ్మ, బొప్పం టీవీ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేశాడన్నారు. సైట్ సినిమాలు చూసేందుకు వెబ్ సైట్లను ఓపెన్ చేసిన వారికి ఏపీకే లింక్స్ పంపి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు చేసి కోట్ల రూపాయలు ఆర్జించినట్లు పోలీసులు తెలిపారు. అతని బ్యాంక్ ఖాతాలో రూ.20 కోట్ల లావాదేవీలను గుర్తించారు.






