తెలంగాణ‌లోకి 13 ప్ర‌ఖ్యాత UK స్కూల్స్ క్యాంప‌స్‌లు

by Gantepaka Srikanth |

దేశంలోనే అత్యద్భుత‌మైన వ‌ర‌ల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ క‌ల్గిన హైద‌రాబాదు మ‌హాన‌గ‌రానికే అంత‌ర్జాతీయ సంస్థ‌లు జై కొడుతున్నాయి.

తెలంగాణ‌లోకి 13 ప్ర‌ఖ్యాత UK స్కూల్స్ క్యాంప‌స్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోనే అత్యద్భుత‌మైన వ‌ర‌ల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ క‌ల్గిన హైద‌రాబాదు మ‌హాన‌గ‌రానికే అంత‌ర్జాతీయ సంస్థ‌లు జై కొడుతున్నాయి. ఇదివ‌ర‌కు ఐటీ కంపెనీలు, బ‌యో సంబంధిత సంస్థ‌లు, ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ కంపెనీలు ఆస‌క్తి చూపుతుండ‌గా.. తాజాగా విద్యా సంస్థ‌లు కూడా రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు క్యూ క‌డుతున్నాయి. యునైటెడ్ కింగ్‌డ‌మ్(యూకే)కు చెందిన 13 ప్ర‌ఖ్యాత పాఠ‌శాల‌లు హైద‌రాబాద్ న‌గ‌రంలో త‌మ క్యాంప‌స్‌ను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్య‌క్తం చేశాయి. ఈ మేర‌కు యూకే ప్ర‌భుత్వం నుంచి తెలంగాణ స‌ర్కారుకు గ్రీన్ సిగ్న‌ల్ అందింది. అందులో భాగంగా యూకే డిపార్టుమెంట్ ఆఫ్ బిజినెస్ అండ్ ట్రేడ్ నేతృత్వంలోని ప్ర‌తినిధి బృందం.. రేపు(మార్చి 18న) రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నుంది. ఈ సంద‌ర్భంగా స్థానిక ఉన్న‌తాధికారుల‌తో యూకే ప్ర‌తినిధులు కీల‌క స‌మాలోచ‌న‌లు జ‌ర‌ప‌నున్నారు.

కీల‌క ద‌శ‌కు చర్యలు..

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ డాక్యుమెంటు మేర‌కు అంత‌ర్జాతీయ సంస్థ‌లు రాష్ట్రంలోకి ఆహ్వానించేందుకు ప్ర‌జా ప్ర‌భుత్వం తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ది. ఈ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధి బృందంలో 13 యూకే స్కూల్స్‌కు సంబంధించిన రిప్ర‌జేంటెటివ్స్, యూకే ప్ర‌భుత్వ అధికారులు పాల్గొన‌నున్నారు. తెలంగాణ‌లోకి రానున్న ప్రైవేటు విద్యా సంస్థ‌లు, కేజీ టూ ప్ల‌స్ 2 క‌రికులంలో అగ్ర‌గామిగా పేరొందాయి. స్థానికంగా విద్యాశాఖ ఉన్న‌తాధికారులు, వివిధ శాఖ‌లు మున్సిప‌ల్‌, విద్యా, ఐటీ, ఫ్యూచ‌ర్ సిటీ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీకి చెందిన అధికారులు చర్చించనున్నారు. ఈ విష‌యంలో మ‌రింత స‌మ‌న్వ‌యం, యూకే విద్యా సంస్థ‌లు మ‌న రాష్ట్రంలో ఏర్పాటు చేయ‌బోయేవాటికి ఏ విధ‌మైన టైమ్ లైన్ ను నిర్దేశించుకుని వెళ్ళాలో చ‌ర్చ‌లు సాగ‌నున్నాయి. అయితే, యూకేకు సంబంధించిన విశ్వ‌విద్యాల‌యాలు సైతం తెలంగాణలో వారి క్యాంప‌స్‌లు ఏర్పాటు చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌న్నీ ఒక కీల‌క ద‌శ‌కి చేరుకున్న విష‌యం విదిత‌మే.

క్యాంప‌స్‌లు ఎక్క‌డ..?

ఈ క్యాంప‌స్‌లు ఎక్క‌డ పెట్టాల‌న్న దానిపై తెలంగాణ ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారులు స‌మ‌గ్రంగా చ‌ర్చ‌లు చేస్తున్ప‌టికీ, మరొవైపు భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీలో ఇప్ప‌టికే ప్ర‌త్యేకంగా ఒక ఎడ్యుకేష‌న్ జోన్ లో వ‌ర‌ల్డ్ క్లాస్ ఎడ్యుకేష‌న్ ఇనిస్టిట్యూష‌న్స్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి అడుగులు ప‌డుతున్నాయి.

Next Story