- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maoists surrender: మావోయిస్టులకు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్.. వరంగల్ లో 13 మంది..
మావోయిస్టులకు తెలంగాణ పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా వరంగల్ పోలీసుల ఎదుట 13 మంది మావోయిస్టులు (Maoists Surrenders) లొంగిపోయారు. వరంగల్ మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను వరంగల్ పోలీస్ (Warangal Police) కమిషనరేట్ లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మావోయిస్టులకు రివార్డులు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లొంగిపోయిన మావోయిస్టులు ఛత్తీస్ గఢ్ బీజాపూర్ ప్రాంతం గుత్తికోయ కమ్యూనిటికి చెందిన వారని తెలిపారు. తెలంగాణ పోలీసులు కల్పించిన అవహాగాహనతో వీరంతా తెలంగాణ పోలీసులకు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 250 మంది మావోయిస్టులు లొంగిపోతే వారిలో 90 శాతం మంది ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నారని చెప్పారు.
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దు్లోని కర్రిగుట్టల్లో జరుగుతున్న కూంబింగ్ లో తెలంగాణ పోలీసుల (Telangana Police) ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. ఈ కూంబింగ్ ఛత్తీస్ గఢ్, కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ అన్నారు. ఈ విషయంలో మాకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదన్నారు. తెలంగాణ పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నారు.






