మొంథా వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్ల తక్షణ సాహయం విడుదల

by Prasad Jukanti |   (  Updated:2025-11-11 07:53:25  IST  )

మొంథా తుపాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద నిధులు విడుదల చేసింది.

మొంథా వరద బాధిత కుటుంబాలకు రూ.12.99 కోట్ల తక్షణ సాహయం విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మోంథా తుపాను (Montha Cyclone) ప్రభావంతో ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం (flood relief) కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.99 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. మెంథా తుపాను వల్ల అక్టోబర్ 27 నుంచి 30 వరకు వరుసగా నాలుగు రోజులు రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను ప్రభావంతో వరంగల్, హన్మకొండ, వికారాబాద్, వనపర్తి, రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, ములుగు, మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి కోతగూడెం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. తుపాను వల్ల ప్రభావిత 16 జిల్లాల్లో 8662 ఇండ్లు దెబ్బతిన్నాయని ఆయా జిల్లాల కలెక్టర్లు పంపిన నివేదికల ప్రకారం వీరికి తక్షణ సాయంగా రూ.12.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా బాధిత కుటుంబాల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నారు.

Next Story