HYD: అంబేద్కర్ భారీ విగ్రహానికి ప్రపంచ స్థాయి గుర్తింపు

by Disha Web Desk 2 |
HYD: అంబేద్కర్ భారీ విగ్రహానికి ప్రపంచ స్థాయి గుర్తింపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ఎత్తైన 125 అడుగుల భారత రాజ్యంగా నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం నిర్మించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ దేశ వ్యాప్తంగా ప్రశంసల పరంపర కొనసాగుతుంది. ఈ క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రపంచ స్థాయి గుర్తింపు సైతం లభించింది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం నమోదైంది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు మీద రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు శనివారం ట్యాంక్ బాండ్ వద్ద అందించారు. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో అంబేద్కర్ విగ్రహం స్థానం పొందటం ఆనందంగా ఉందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.


దేశ, విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు ప్రసార మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు చెబుతున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రపంచ స్థాయిలోనే అంబేద్కర్ విగ్రహం టూరిజం స్పాట్‌గా మారుతుందని మంత్రి గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, న్యూమరాలజిస్ట్ దైవజ్ఞశర్మ, జగిత్యాల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ హరిచరణ్, హైరేంజ్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్స్ డైరెక్టర్స్ శ్రీకాంత్, సుమన్ పల్లె తదితరులు పాల్గొన్నారు.




Next Story

Most Viewed