విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రూ.12 లక్షలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

by Satheesh |   (  Updated:2023-09-18 12:14:21  IST  )

ఈ నెల 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.

విశ్వకర్మ జయంతి ఉత్సవాలకు రూ.12 లక్షలు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 17న విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. యజ్ఞ మహోత్సవం పేరిట ఉత్సవాల నిర్వహణకు 12లక్షలు మంజూరు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వబ్రాహ్మణుల కోఆపరేటీవ్ సొసైటీ నుంచి 33 జిల్లాలకు జల్లాకు 5వేల చొప్పున విశ్వకర్మ జయంత్యుత్సవాల నిర్వహణకు కేటాయించింది. మిగిలిన ఫండ్ ను ఉత్సవాల నిర్వహణ కమిటీ లకు అందజేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. ఉత్సవాల నిర్వహణకు అయిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను అందజేయాలని ఆదేశించింది.

Next Story