తెలుగు రాష్ట్రాల్లో రూ. 1150కోట్ల ఎస్ఎస్‌హెచ్‌జీ రుణాలు

by velandi.Saikiran |

జనరల్ మేనేజర్ (ఆర్‌బీడీ) వి. చంద్రశేఖరన్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్ కుమార్, విజయవాడ జోనల్ మేనేజర్ ఎం. రాజేష్,

తెలుగు రాష్ట్రాల్లో రూ. 1150కోట్ల ఎస్ఎస్‌హెచ్‌జీ రుణాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ఇండియన్ బ్యాంక్ విజయవాడ జోన్ ఆధ్వర్యంలో ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ఎస్‌హెచ్‌జీ అవుట్‌రీచ్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ (ఆర్‌బీడీ) వి. చంద్రశేఖరన్, ఫీల్డ్ జనరల్ మేనేజర్ ప్రణేష్ కుమార్, విజయవాడ జోనల్ మేనేజర్ ఎం. రాజేష్, అమరావతి జోనల్ మేనేజర్ ఎన్. గౌరీ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ ఎం. రాజేష్ మాట్లాడుతూ, కృష్ణా–ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు 5,000 స్వయం సహాయక బృందాలకు ఇండియన్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ప్రధాన అతిథి వి. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, ఏపీ–తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ.1,150 కోట్ల ఎస్‌హెచ్‌జీ రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. మహిళా సాధికారతకు బ్యాంక్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Next Story