- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : జూన్ 3 నుంచి 10th సంప్లమెంటరీ పరీక్షలు.. ఏర్పాట్లు సిద్ధం
తెలంగాణ(Telangana)లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల(10th Advanced Supplementary Exams)కు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల(10th Advanced Supplementary Exams)కు ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు 42,832 మంది విద్యార్థులు హాజరవనున్నారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 150 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(Telangana Board of Secondary Education) వెబ్‌సైట్ bse.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డ్ తెలిపింది.
హాల్‌టికెట్ లేకుండా పరీక్షకు హాజరు కానివ్వబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు ఉదయం 9:00 గంటలకఎ పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించింది. మార్చి 2025లో జరిగిన పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇప్పటికే ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. ఆలస్య రుసుముతో మే 16 నాటికే పరీక్ష ఫీజు చెల్లింపు పూర్తయ్యింది. ఇక ఈ పరీక్ష ఫలితాలు జులై 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది.






