- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్ ఎగ్జామ్స్ కూడా సరిగ్గా నిర్వహించలేరా మేడం? : ఆర్ఎస్‌పీ
by samatah |
రాష్ట్రంలో వరుస పేపర్ లీకుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న పదవతరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటన మరువకముందే.. నేడు పరీక్ష ప్రారంభమయ్యే (9.30 గంటలు) సమయానికి హిందీ పేపర్ వాట్సాప్‌లో

X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో వరుస పేపర్ లీకుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. నిన్న పదవతరగతి తెలుగు ప్రశ్నాపత్రం లీక్ ఘటన మరువకముందే.. నేడు పరీక్ష ప్రారంభమయ్యే (9.30 గంటలు) సమయానికి హిందీ పేపర్ వాట్సాప్‌లో చక్కర్లుకొట్టింది. ఈ వరుస ఘటనలపై ప్రతిపక్ష నేత, బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కనీసం పదవతరగతి పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేరా అంటూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. గన్ పార్క్ దగ్గర తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దయచేసి ఆ పదవి నుండి ఈ రోజే వైదొలగాలని, మిమ్మల్ని ఎవరు ఏం అనరంటూ ఆర్ఎస్పీ సూచించారు. పరీక్షల గురించి ఎప్పుడైనా సమీక్ష చేసిండ్రా సీఎం? అంటూ సీఎంఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Tags
- 10th exams
- RSP
Next Story






