TG: టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ‌అప్‌డేట్

by Gantepaka Srikanth |

పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ పరీక్షల తుది ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

TG: టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ‌అప్‌డేట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న టెన్త్ పరీక్షల తుది ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 16వ తేదీతో పదో తరగతి పరీక్షలు ముగియనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,676 పరీక్షా కేంద్రాల్లో పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తి స్థాయిలో మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ఏడాది ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలనే లక్ష్యంతో, విద్యాశాఖ ముందస్తుగానే వ్యూహరచన చేసింది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 3వ తేదీ నుంచే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ప్రధాన భాషలు, గణితం వంటి పేపర్ల మూల్యాంకనం కొనసాగుతోంది. సైన్స్, సోషల్ స్టడీస్ పేపర్లను రెండో విడతలో మూల్యాంకనం చేయనున్నారు. అంటే ఆయా సబ్జెక్టుల పరీక్షలు పూర్తయిన అనంతరం జవాబు పత్రాలను దిద్దనున్నారు. ఈ నెల 23లోగా మూల్యాంకన ప్రక్రియను పూర్తిచేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మూల్యాంకనం పూర్తయిన వెంటనే మార్కుల నమోదు ప్రక్రియను చేపట్టనున్నారు.

గతేడాది కంటే స్వల్ప ఆలస్యం..

గత ఏడాది పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. అయితే, ఈసారి పరీక్షల షెడ్యూల్, మూల్యాంకం, మార్కుల నమోదు ప్రక్రియ తదితర కారణాల దృష్ట్యా మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దృష్ట్యా, ఫలితాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

Next Story