10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు

by Muthe.Rajitha |

పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం.

10th విద్యార్థులకు గుడ్ న్యూస్.. పరీక్షల ఫీజు చెల్లింపు గడువు పెంపు
X

దిశ, వెబ్ డెస్క్ : పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది ప్రభుత్వం. రాష్ట్రంలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు గ‌డువును పాఠ‌శాల విద్యాశాఖ పొడిగించింది. ఈ నెల 20వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అప‌రాధ రుసుం లేకుండా ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చ‌ని పేర్కొంది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆలస్య రుసుము రూ.50తో ఈ నెల 21 నుంచి 29 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొంది. ఇక రూ.200 లేట్‌ ఫీజుతో డిసెంబర్‌ 2 నుంచి 11 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 15 నుంచి 29 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story