- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్న తండ్రి కాదు.. క్రూర మృగం.! బిడ్డపై అత్యాచారం
రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. అమ్మాయిలు పుట్టింట్లో కూడా భద్రత లేకపోవడం నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులకు

దిశ, నారాయణపేట ప్రతినిధి/మరికల్ : రోజురోజుకూ మానవత్వం మంటగలుస్తోంది. అమ్మాయిలు పుట్టింట్లో కూడా భద్రత లేకపోవడం నేటి సమాజంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. లాలించి రక్షించాల్సిన చేతులే నేరాలకు పాలు కావడం శోచనీయం.. చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు సమాజ దారుణ స్థితిని ఉద్ఘాటిస్తున్నాయి.
నారాయణపేట జిల్లా మరికల్లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరికల్ ఎస్సై రాము, గ్రామస్తుల నుండి సేకరించిన ప్రకారము వివరాలు ఇలా ఉన్నాయి. మరికల్ మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన పదేళ్ల బాలిక ఐదవ తరగతి చదువుతోంది. ఈనెల 25వ తేదీన పాఠశాల ముఖ్య గాని ఇంట్లో హోం వర్క్ చేసుకుంటుండగా .. తండ్రి అప్పుడే ఇంటికి వచ్చాడు. మిగతా కుటుంబ సభ్యులు వివిధ పనుల కోసం బయటకు వెళ్లగా ఒంటరిగా ఉన్న కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలికకు రక్తస్రావం కావడంతో అతడు పరారీ అయ్యాడు. తల్లి, కుటుంబ సభ్యులు బాధిత బాలికను వైద్యం కోసం ఈనెల 26న ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వారి సూచన మేరకు బాలికను మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాగా బాలికపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ కు తెలియజేయడంతో.. సమాచారం అందుకున్న మరికల్ ఎస్సై హుటాహుటిన గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాము తెలిపారు.






