- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీలి చిత్రాల్లో నటిస్తే రూ. 10 లక్షలా? రూంకు తీసుకెళ్లి మరీ !
. నీలి చిత్రాలలో నటిస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి మోసం చేశారట కొంతమంది దుర్మార్గులు.

దిశ, వెబ్ డెస్క్: సమాజంలో రోజు రోజుకు క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది. ఏదో ఒక రూపంలో నేరం జరుగుతోంది. కాలం మారిన కొద్ది సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని, డబ్బులు అన్యాయంగా కొట్టేస్తున్నారు. రకరకాల వీడియోల లింకులు, ఇతర ప్రొడక్ట్స్ పంపి జనాలను మోసం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇక ఈ మధ్య నీలి చిత్రాల్లో నటిస్తే, డబ్బులు ఇస్తామని కూడా కొత్త క్రైమ్ కు తెర లేపారు.
నీలి చిత్రాలలో నటిస్తే రూ.10 లక్షలు ?
తాజాగా ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. డబ్బు ఆశ చూపి, ఓ వివాహితను మోసం చేసిన సంఘటన హైదరాబాద్ లో తాజాగా జరిగింది. నీలి చిత్రాలలో నటిస్తే ఏకంగా 10 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మించి మోసం చేశారట కొంతమంది దుర్మార్గులు. ఇందులో భాగంగానే ఆ బాధిత మహిళను ఓ హోటల్ రూమ్ కు తీసుకువెళ్లి.. తమ పని కానిచ్చేసారట. ఆ తర్వాత మోసానికి గురైనట్లు ఆ బాధిత మహిళ గుర్తించినట్లు సమాచారం.
దీంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. అటు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని ఈ పోలీసులు చెబుతున్నారు. అపరిచితుల మాటలు నమ్మి మోసపోకండి... ఇలాంటి ఫేక్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.






