అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Rajesh |
అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం రూ.1190 కోట్లు మంజూరు చేసింది. జిల్లా ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతో అభివృద్ధి పనులు చేపట్టాలని జీవోలో పేర్కొంది. ఇందులో రూ.2 కోట్లు విద్యా సంస్థలకు ఖర్చు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మంచి నీటికి రూ.కోటి ఖర్చు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

Next Story

Most Viewed