ఉప్పల్ భగాయత్‌లో 10 ఎకరాలు స్థలం.. రూ.98 కోట్ల నిధులు

by Gantepaka Srikanth |

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆఫీసు నిర్మాణానికి హెచ్ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ -3లోని 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఉప్పల్ భగాయత్‌లో 10 ఎకరాలు స్థలం.. రూ.98 కోట్ల నిధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్(ఎంఎంసీ) ఆఫీసు నిర్మాణానికి హెచ్ఎండీఏకు చెందిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ -3లోని 10 ఎకరాల భూమిని కేటాయిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. దీంతోపాటు పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి రూ.98 కోట్లు అంచనా వేశారు. ఈ రూ.98 కోట్లకు సైతం ప్రభుత్వం పరిపాలన మంజూరు ఇచ్చింది. ఏడాది కాలంలో ఎంఎంసీ ఆఫీసు బిల్డింగ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంఎంసీ ఆఫీసు ప్రస్తుతం తార్నాకలోని హెచ్ఎండీఏకు సంబంధించిన బిల్డింగ్ లో ఉన్న కొనసాగుతున్నది.

సీఎంసీ ఆఫీసుకు..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(సీఎంసీ) ఆఫీసు పర్మింట్ బిల్డింగ్ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ఖైతలాపూర్ లోని రెండు ప్రాంతాల్లో ప్రభుత్వం భూములను పరిశీలించారు. త్వరలోనే రెండింటిలో ఒకదానికి ఫైనల్ చేయనున్నారు. ఏడాది కాలంలో కొత్త బిల్డింగ్‌ను నిర్మించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. అయితే ప్రస్తుతం సీఎంసీ ఆఫీసు మాదాపూర్‌లోని న్యాక్ బిల్డింగ్‌లో కొనసాగుతోంది.

Next Story