- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1 PM Dynamic: కేసీఆర్‌కు బిగ్ షాక్.. అమెరికా టూర్‌కు ముందే ‘కాళేశ్వరం’ నోటీసులు
కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది.

* కాళేశ్వరం కేసులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్‌కు పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కాగా కమిషన్ విచారణకు గడువును ప్రభుత్వం నిన్న పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం, మాజీ మంత్రులకు నోటీసులు ఇవ్వడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
* ఏపీ మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం సచివాలయంలో మొదలైంది. మొత్తం 25 అంశాలపై సమావేశంలో చర్చ జరుగుతోంది. ఇంకా ఉద్యోగుల బదిలీలు, పలు సంస్థలకు భూ కేటాయింపులు, అమరావతి పునర్నిర్మాణం అంశాలపై చర్చిస్తున్నారు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులపై చర్చిస్తున్నట్లు సమాచారం. మంత్రి మండలి చర్చించే అంశాలు ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి తెలుసుకోండి.
* ధరణి పేరుతో బీఆర్ఎస్ సర్కార్ రైతులను నిలువునా దోచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అదేవిధంగా రైతులకు ప్రభుత్వ, అటవీ భూము మధ్య గట్ల పంచాయితీపై కీలక ప్రకటన చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే వార్తలోకి వెళ్లండి మరి.
* గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సమగ్ర విచారణకు గాను ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే, ఆ కమిటీలో ప్రభుత్వం ఎవరెవరిని భాగస్వాములను చేసిందో మీరు చూసేయండి.
* రాజ్‌భవన్‌లో చోరీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. హార్డ్ డిస్క్‌లను ఎత్తుకెళ్లింది అక్కడ పని చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగేనని తేలింది. ఇంతకీ అతడు హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లడానికి గల కారణాలు ఏంటి? నిందితుడు అసలు ఏం చేశాడో తెలియాలంటే వార్తలోకి వెళ్లండి మరి.






