Congress: ఎస్టీలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుడ్ న్యూస్

by Prasad Jukanti |   (  Updated:2026-03-11 13:07:00  IST  )

రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం చేస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Congress: ఎస్టీలకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమర్థంగా అమలు చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 70 శాతం డీసీసీలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చామని, ఇందులో ఐదుగురు ఎస్టీ నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామని చెప్పారు. ఇవాళ గాంధీ భవన్‍లో నిర్వహించిన తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజారిటీ డైరెక్టర్ పోస్టులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ హక్కులు, భూమి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు.

ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవు:

లంబాడీలు ఎక్కువగా ఉన్న తన స్వగ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని ఇచ్చానని, ఆదివాసి హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసి సమాజం కీలక భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 75 శాతంపైగా స్థానాలు గెలుచుకున్నామని చెప్పారు.

మోడీ అడ్డంగా దొరికిపోయారు:

ఎప్‍స్టీన్ పైల్స్ లో మోడీ అడ్డంగా దొరికిపోయారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ప్రధాని పదవిని త్యాగం చేసిన మహనీయులు సోనియా గాంధీ అని, దేశం కోసం ప్రధాని కావాలని సీఎం రేవంత్ రెడ్డి అడగ్గానే మొదటిసారి రాహుల్ గాంధీ ప్రధాని అవుతానని అన్నారని గుర్తు చేశారు. దేశ ప్రజల సంరక్షణ కోసం రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం అట్టడుగు వర్గాల అభ్యున్నతేనని రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వివరాలను అధికారికంగా నమోదు చేశారని చెప్పారు.

Next Story