'Pushpa' స్టైల్‌లో స్మగ్లింగ్.. పరుపుల చాటున దందా.. కానీ ఇక్కడ అడ్డంగా..

by Disha Web Desk 4 |
Pushpa స్టైల్‌లో స్మగ్లింగ్.. పరుపుల చాటున దందా..  కానీ ఇక్కడ అడ్డంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'పుష్ప' మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ అక్రమంగా ఎలా జరుగుతుందనే విషయం చూపించిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తాడు. పోలీసుల చెక్ పోస్ట్ ల దగ్గర తప్పించుకుని ఎర్రచందనం స్మగ్లింగ్ చేశాడు. అయితే పుష్ప సినిమా స్టైల్ లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఇటీవల చాలా వెలుగుచూస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ లో పుష్ప సినిమా తరహాలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏపీలోని బలిమెల నుంచి హైదరాబాద్ కు కొత్త పరుపుల్లో గంజాయి పెట్టి తరలిస్తున్న ముఠా పోలీసులకు అడ్డంగా బుక్కైంది. కొత్త పరుపుల్లో పెట్టి తరలిస్తున్న దాదాపు 81 కిలోల గంజాయిని మియాపూర్ పోలీసులు పట్టుకున్నారు.


Next Story

Most Viewed