- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ప్రైవేట్ షాపింగ్ మాల్ సీజ్
హైదరాబాద్ లో నిర్మితమైన ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు.

X
దిశ, రాంనగర్: హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో నిర్మితమైన ఓ ప్రైవేట్ షాపింగ్ మాల్ అక్రమ నిర్మాణాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. సుమారు 8 నెలల క్రితం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేకుండానే మాల్‌ను ప్రారంభించగా, ప్రారంభోత్సవానికి సినీ నటి హాజరయ్యారు. ఈ వ్యవహారంపై గతంలో అనేకసార్లు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసినా మాల్ యాజమాన్యం స్పందించకపోవడంతో చివరికి చర్యకు దిగారు.
మాల్‌ను సీజ్ చేసిన అధికారులు మీడియాకు ఎలాంటి వివరాలు ఇవ్వకుండా వెళ్లిపోవడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అకస్మాత్తు చర్యతో మాల్‌లో పని చేస్తున్న సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ సీజ్ వల్ల తమ ఉద్యోగాలపై ముప్పు పొంచి ఉందంటూ సుమారు 100 నుంచి 150 మంది ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story






