ప్రిజన్ మేనేజ్‌మెంట్ పై శిక్షణ.. 11 రాష్ట్రాల నుంచి జైళ్లశాఖ సిబ్బంది హాజరు

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-24 16:14:28  IST  )

దేశ వ్యాప్తంగా కారాగార వ్యవస్థలో వృతి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రిజన్ మేనేజ్‌మెంట్ పై రాష్ట్రశిక్షా పరిపాలన సంస్థ (ఎస్ఐసీఏ)లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు.

ప్రిజన్ మేనేజ్‌మెంట్ పై శిక్షణ.. 11 రాష్ట్రాల నుంచి జైళ్లశాఖ సిబ్బంది హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశ వ్యాప్తంగా కారాగార వ్యవస్థలో వృతి నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ప్రిజన్ మేనేజ్‌మెంట్ పై రాష్ట్రశిక్షా పరిపాలన సంస్థ ( ఎస్ఐసీఏ)లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా తెలిపారు. జైలు నిర్వహణ ప్రాధమిక సూత్రలు, రాజ్యాంగ పరంగా కోర్టు ఆదేశాల అమలుపై శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాలకు 11 రాష్ట్రాలకు చెందిన 25మంది ప్రిజన్ సిబ్బంది హాజరైనట్లు తెలిపారు. జైలు నిర్వహణ, ఖైదీలతో ప్రవర్తించాల్సిన మెళకువలు, వారిని మానవత దృక్పథం వైపు నడిపించే అంశాలపై శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. జైలు నుంచే బయటకు వెళ్లే వారు సమాజం పట్ల భద్రత చూపించే విధంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు.

Next Story