- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ఎంపీ ఈటల వర్సెస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.. పోటాపోటీగా నినాదాలు
మల్కాజిగిరిలో రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య క్రెడిట్ వార్ ఉద్రిక్తతకు దారితీసింది. బీజేపీ–బీఆర్ఎస్ నినాదాలతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

దిశ, డైనమిక్ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య క్రెడిట్ వార్ హాట్ టాపిక్‍గా మారింది. ఇవాళ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరెడ్‍మెట్ లో రైల్వే అండర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగింది. తమ పోరాటం కారణంగానే రైల్వే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేయగా స్టేజి కింద ఉన్న వారు ఇది రాజకీయ వేదిక కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 'నీకు సబ్జెక్ట్ తెలియకుంటే కూర్చోరాబై' అని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అక్కడున్న బీజేపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు భారత్ మాతాకీ జై అంటూ బీజేపీ, మరోవైపు జై తెలంగాణ అంటూ బీఆర్ఎస్ మద్దతుదారులు నినాదాలు చేయడంతో అక్కడ ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ఎంపీ ఈటల కలగజేసుకుని అంతరిని శాంతిపజేశారు.
రెండు వారాల క్రితం సేమ్ సీన్:
కాగా ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య రెండు వారాల క్రితం సైతం ఇదే తరహా క్రెడిట్ వార్ నడిచింది. మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ అండర్ బ్రిడ్జ్ పనులకు నిధులు తాము తెచ్చామంటే తామే తెచ్చామంటూ ఇరు వర్గాల నేతలు బాహాబాహీకి దిగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఘటన మరువక ముందే తాజాగా ఇప్పుడు మరోసారి సేమ్ సీన్ రిపీట్ కావడం చర్చనీయాశంగా మారింది.






