Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపునకు ముహూర్తం ఫిక్స్

by Malleboina Mahesh |   (  Updated:2025-05-04 07:13:23  IST  )

హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో వేలాది మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ.. సులువుగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.

Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీల పెంపునకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఉన్న మెట్రో (Metro) వేలాది మంది ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ మెట్రోలో ప్రతి రోజు లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తూ.. సులువుగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. అయితే గత కొంతకాలంగా L&T సంస్థ నష్టాల్లో కొనసాగుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ఈ సంస్థకు భారీగా నష్టాలు వచ్చాయి. కాగా ఈ నష్టాల నుంచి గట్టు ఎక్కేందుకు చార్జీల పెంపునకు (Charge increase) అనుమతి కోరుతూ నాటి ప్రభుత్వం వద్దకు వెళ్లగా.. అనుమతి లభించలేదు. తాజాగా ఈ నష్టాలు కొనసాగుతుండటంతో.. మరోసారి ఛార్జీల పెంపుపై తెలంగాణ ప్రభుత్వానికి నివేదికలు అందజేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతులు పొందితే మే రెండో వారం నుంచి మెట్రో చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని

ద్వారా వార్షికంగా అదనంగా రూ.150 కోట్ల వరకు రాబట్టుకునేలా సంస్థ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం మెట్రోలో కనిష్ఠంగా రూ.10, గరిష్ఠం రూ.60 ఉండగా.. కనిష్ఠంగా 15 గరిష్ఠం రూ.75 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో సామాన్య ప్రయాణికులపై భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల బెంగళూరు మెట్రో చార్జీలు 44% పెరగడంతో, హైదరాబాద్‌లో ఎంత పెంచాలనే యోచనలో L&T మెట్రో సంస్థ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.59 హాలిడే సేవర్ కార్డు రద్దు, మెట్రో కార్డు పై రద్దీ వేళల్లో 10% డిస్కౌంట్ ఎత్తివేసిన విషయం తెలిసిందే.

Next Story