గ్రామ పంచాయతీలకు మహర్దశ.. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-05 06:32:06  IST  )

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

గ్రామ పంచాయతీలకు మహర్దశ.. కేంద్రం నుంచి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం (Government Of India) గుడ్‌న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధుల (15th Finance Commission Funds)ను విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.259.36 కోట్లను కేటాయించింది. అయితే, రాష్ట్రంలో గ్రామ పంచాయతీల గడువు ముగిసినప్పటికీ ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడంతో కేంద్రం నిధులను పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇటీవల పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో నిధుల విడుదలకు ఉన్న సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి.

కాగా, ఈ నిధుల సాధనలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) ప్రత్యేకంగా చొరవ చూపారు. పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరపడం, ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడంలో ఈ నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.3 వేల కోట్ల వరకు నిధులు అందాల్సి ఉంది. ఈ క్రమంలోనే విడతల వారీగా నిధుల విడుదల భాగంగా రూ.259.36 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా విడదులైన నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు ఇతర అత్యవసర అభివృద్ధి పనులకు వినియోగించనున్నారు.

Next Story