- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ స్థాయి యోగాసన పోటీలకు గుజరాత్ వెళ్లిన తెలంగాణ టీం
by Shyam |
<p>దిశ, డైనమిక్ బ్యూరో : గుజరాత్ రాష్ట్రంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరగనున్న సెకండ్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్‌కు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకంగా జరుతున్న ఈ పోటీలకు అహ్మదాబాద్‌లోని లౌక్లిష్ యోగా యూనివర్సిటీ ముస్తాబు అయ్యింది. మొత్తం 26 రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు పాల్గొననుండగా.. తెలంగాణ జట్టు కూడా ఇందులో భాగస్వామ్యం కానుంది. తెలంగాణ నుంచి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి 12 మంది టీమ్ సభ్యులు పాల్గొంటున్నారు. […]</p>

X
దిశ, డైనమిక్ బ్యూరో : గుజరాత్ రాష్ట్రంలో ఈనెల 17 నుంచి 19 వరకు జరగనున్న సెకండ్ నేషనల్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్‌కు సర్వం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకంగా జరుతున్న ఈ పోటీలకు అహ్మదాబాద్‌లోని లౌక్లిష్ యోగా యూనివర్సిటీ ముస్తాబు అయ్యింది. మొత్తం 26 రాష్ట్రాల నుంచి వచ్చిన జట్లు పాల్గొననుండగా.. తెలంగాణ జట్టు కూడా ఇందులో భాగస్వామ్యం కానుంది. తెలంగాణ నుంచి తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి 12 మంది టీమ్ సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పటికే టీమ్ సభ్యులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అహ్మదాబాద్‌కు తరలి వెళ్లారు. మూడు రోజులపాటు జగరనున్న ఈ పోటీల్లో సాంప్రదాయ, కళాత్మక మరియు రిథమిక్ విభాగాల్లో నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.దత్తాత్రేయరావు, జనరల్ సెక్రటరీ జి.సురేందర్ నాథ్ తెలిపారు.
Next Story






