బిగ్ బ్రేకింగ్.. సీఎంతో ఎల్.రమణ భేటీ

by Vadlamudi Anukaran |   (  Updated:2021-07-08 01:50:23  IST  )

<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. టీఆర్ఎస్‌లో చేరే విషయం గురించి ఇప్పటికే కేడర్‌తో చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చిన ఎల్. రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తరువాత గులాబీ గూటికి చేరే విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. జ్యేష్ట మాసం ముగియనున్నందున ఆషాడ మాసంలో చేరికకు ముహుర్తాలు ఉండే అవకాశాలు లేవన్న కారణంగానే [&hellip;]</p>

బిగ్ బ్రేకింగ్.. సీఎంతో ఎల్.రమణ భేటీ
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నారు. టీఆర్ఎస్‌లో చేరే విషయం గురించి ఇప్పటికే కేడర్‌తో చర్చలు జరిపి నిర్ణయానికి వచ్చిన ఎల్. రమణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన తరువాత గులాబీ గూటికి చేరే విషయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌తో జరిగే భేటీలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. జ్యేష్ట మాసం ముగియనున్నందున ఆషాడ మాసంలో చేరికకు ముహుర్తాలు ఉండే అవకాశాలు లేవన్న కారణంగానే సీఎంతో ఆయన సమావేశం అవుతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు టీటీడీపీ చీఫ్ రమణ పార్టీ ఫిరాయింపు దాదాపు ఖాయం అయిపోయినందున టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేయనున్నట్టు సమాచారం.

Next Story