సెక్రటేరియట్ నిర్మాణ టెండర్ ఎవరికి దక్కిందంటే..!

by  |
సెక్రటేరియట్ నిర్మాణ టెండర్ ఎవరికి దక్కిందంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో పాత సెక్రటేరియట్ భవనాల కూల్చివేత ప్రక్రియ ముగియగా .. వాటి స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. కొత్త సెక్రటేరియట్ భవన నమూనాను ఇప్పటికే సీఎం ఫైనల్ చేశారు. ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ తయారు చేసిన డిజైన్‌ స్వల్ప మార్పులతో ఒకే అయింది. లెటేస్ట్ హంగులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణ హితంగా కొత్త సచివాలయం నిర్మాణం జరుపుకోనుంది. దీని నిర్మాణానికి రోడ్లు భవనాల శాఖ గత నెలలో టెండర్లు ఆహ్వానించగా.. నిర్మాణ అంచనా వ్యయాన్ని రూ.500 కోట్లుగా ప్రకటించింది.

అందుకోసం పలు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, గత నెల 18 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు ప్రభుత్వం టెండర్లు స్వీకరించింది. కాగా, బుధవారం సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి. వాటిని కమిషనర్ ఆఫ్ టెండర్స్ ఫైనల్ చేసింది. సెక్రటేరియల్ నిర్మాణం బాధ్యతను ‘షాపూర్జీ-పల్లొంజీ’ కంపెనీ దక్కించుకుంది. టెండర్లు ఖరారైన నేపథ్యంలో ప్రభుత్వానికి- షాపూర్జీ-పల్లొంజీ సంస్థల మధ్య అగ్రిమెంట్ కుదరనుంది. దాని ప్రకారం టెండర్లు దక్కించుకున్న కంపెనీ ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రోజు నుంచి 12 నెలలలోపు సెక్రటేరియట్ కాంప్లెక్స్ ను నిర్మించాల్సి ఉంటుంది.

అయితే, ఎప్పటిలోపు ఎంత నిర్మాణం పూర్తి కావాలో కూడా టార్గెట్ విధించనున్నారు. ఉదా.. ఈ దీపావళికి సెక్రటేరియట్ భవనాల నిర్మాణం ప్రారంభమైతే.. వచ్చే ఏడాది దసరా, దీపావళికి నాటికి మొత్తం పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు.


Next Story

Most Viewed