- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చంద్రబాబుకు అవమానం.. సీఎం జగన్‌పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
<p>దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ వేత్తలు, సామాజిక కార్యకర్తలు స్పందించి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు సూచించారు. తాజాగా.. అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం అన్‌ఫిట్ అని […]</p>

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలువురు రాజకీయ వేత్తలు, సామాజిక కార్యకర్తలు స్పందించి వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వైసీపీ నేతలకు సూచించారు. తాజాగా.. అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానంపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదని, అసెంబ్లీ స్పీకర్‌గా తమ్మినేని సీతారాం అన్‌ఫిట్ అని విమర్శించారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే, ముఖ్యమంత్రి జగన్‌తో పాటు వైసీపీ నేతల పరిస్థితేంటి అని ప్రశ్నించారు. చంద్రబాబు నన్ను గుర్తుపట్టే పరిచయం కూడా నాకు లేదు, కానీ, ఒక సీనియర్ నాయకుడిని చట్టసభలో అవమానించడం సరికాదని వైసీపీ నేతలకు హితవు పలికారు. చంద్రబాబు వయసుకైనా గౌరవం ఇవ్వాలని సూచించారు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని, మా పార్టీకి సంబంధం లేదని అన్నారు.






