- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
త్వరలో వైజాగ్‌లో పర్యటిస్తానన్న కేటీఆర్.. ఆహ్వానించిన గంటా
by Vemula.Srinu Prasad |
<p>దిశ,తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో ఆయన భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు […]</p>

X
దిశ,తెలంగాణ బ్యూరో: మంత్రి కేటీఆర్‌ను టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. శాసన సభ సమావేశాల సందర్భంగా బిజీగా ఉన్న కేటీఆర్‌తో అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో ఆయన భేటీ అయ్యారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలపడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయనను కలిసినట్లు గంటా తెలిపారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం మంత్రులతో కలిసి ఓ బృందంగా విశాఖకు వస్తామని కేటీఆర్ చెప్పినట్లు గంటా పేర్కొన్నారు.
Next Story






