- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్..!
<p>దిశ, ముషీరాబాద్: తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. హైదరాబాద్ ముషీరాబాద్ పద్మశాలీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో సోమవారం అశోక్‌నగర్‌లోని బాపూజీ నివాసం వద్ద 8వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీడీపీ నేత ఎల్.రమణ, కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, […]</p>

X
దిశ, ముషీరాబాద్:
తెలంగాణ ఉక్కు మనిషి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ కొనియాడారు. హైదరాబాద్ ముషీరాబాద్ పద్మశాలీ ప్రజా సంఘం ఆధ్వర్యంలో సోమవారం అశోక్‌నగర్‌లోని బాపూజీ నివాసం వద్ద 8వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీడీపీ నేత ఎల్.రమణ, కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. క్విట్ ఇండియా, ముల్కీ వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో బాపూజీ కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి నేతగా బాపూజీ గుర్తింపు పొందారని కొనియాడారు.
Next Story






